కొత్త సంవత్సరం.. డిఫరెంట్ సెలబ్రేషన్స్ !

326
- Advertisement -

కొత్త సంవత్సరం రానే వచ్చింది.. పాత సంవత్సరానికి బై బై చెప్పి.. నూతన ఉత్సాహాన్ని నింపుకొని న్యూ ఇయర్ కు వెల్కం చెప్పేశాము. ఇక న్యూ ఇయర్ మొదటి రోజు చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. గత ఏడాది చివరి రోజు ( థర్టీ ఫస్ట్ ) అర్ధ రాత్రి నుంచి కొత్త సంవత్సరానికి వెల్కం చెప్పేందుకు సెలబ్రేషన్స్ మొదలు పెడతారు. అయితే ఈ న్యూ ఇయర్ మొదటి రోజు సెలబ్రేషన్స్ ను ఒక్కో దేశంలో ఒక్కో విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు. మరి ఏ ఏ దేశాల్లో ఎలాంటి డిఫరెంట్ సెలబ్రేషన్స్ చేసుకుంటారో చూద్దామా !

1. డెన్మార్క్
సాధారణంగా మనం కొత్త సంవత్సరం వచ్చిందంటే టపాసులు పేల్చడం చేస్తూ ఉంటాము. కానీ డెన్మార్క్ లో అలా కాదు.. కొత్త సంవత్సరం వచ్చిందంటే అక్కడ ఇంటి ముందు ప్లేట్ లను పగలగొడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇంటిలో ఉండే చైనా వస్తువులను పెద్ద మొత్తంలో పగలగొడుతూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అక్కడి ప్రజలు. ఇది డెన్మార్క్ లో చాలా కాలం నుంచి ఒక సంప్రదాయంలా కొనసాగిస్తున్నారు.

2. టర్కీ
సాధారణంగా మన దేశంలో కొత్త సంవత్సరం రాగానే ఇంటి ముందు ముగ్గులు వేస్తూ న్యూ ఇయర్ కు ఆహ్వానం పలుకుతారు. కానీ టర్కీలో ఇంటి ముందు ఉప్పు చల్లుతూ న్యూ ఇయర్ కు వెల్క్ చెబుతారు. ఇలా ఇంటి ముందు ఉప్పు చల్లడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని టర్కీ ప్రజల నమ్మకం.

3.ఈక్వెడార్
ఈక్వెడార్ లో కొత్త సంవత్సరం రోజు దిష్టి బొమ్మలను ఊరేగిస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే పాత సంవత్సరంలో జరిగిన చెడుకు ముగింపు పలుగుతూ.. కొత్త సంవత్సరం అంతా మంచే జరగాలని అక్కడి ప్రజలు ఇలా చేస్తారట.

4.ఇటలీ
న్యూ ఇయర్ సందర్భంగా కొత్త బట్టలు దరించి సెలబ్రేట్ చేసుకోవడం షరా మామూలే.. అయితే ఇటలీలో మగవాళ్ళు కాస్త డిఫరెంట్.. అక్కడి మగవాళ్ళంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఎరుపు రంగు లో దుస్తులు దరిస్తారు. ఇలా దరించి బహిరంగ ప్రదర్శన చేస్తారు. ఇలా చేయడం వల్ల సంతానోత్పత్తి మెరుగుపడుతుందని అక్కడి వారి నమ్మకం.

5. గ్రీస్
గ్రీస్ దేశస్థుల్లో ఒక డిఫరెంట్ ఆచారం ఉంది. కొత్త సంవత్సరంలో భాగంగా అక్కడి ప్రజలు ఇంటి గుమ్మానికి కూరగాయలు వేలాడదీస్తారు. ముఖ్యంగా ఉల్లిపాయలను ఇంటి గుమ్మానికి కడతారు. ఈ సాంప్రదాయాన్ని పూర్వం నుంచి కూడా ఆచరిస్తూ ఉన్నారు గ్రేస్ దేశస్తులు. ఇలా చేయడం పునర్జన్మకు సంకేతంగా అక్కడి ప్రజలు భావిస్తారట.

ఇంకా చాలా దేశాలలో న్యూ ఇయర్ వేడుకలను ఎన్నో రకాలుగా జరుపుకుంటూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెబుతారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -