సిద్దిపేటకు ఐటి టవర్.. మంత్రి హరీష్ హర్షం..

162
harish rao
- Advertisement -

సిద్దిపేట జిల్లాకు ఐటి టవర్ రానుంది. రూ.45 కోట్లతో కొండపాక మండలం దుద్దెడ గ్రామం వద్ద ఈ టవర్‌ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు ఐటి టవర్ నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, టూరిజం హోటల్ మధ్యలో రాజీవ్ రహదారిని ఆనుకుని సువిశాల 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఐటి టవర్ నిర్మాణం జరగనుంది.

సిద్ధిపేట జిల్లాకు ఐటి టవర్ మంజూరు పట్ల రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి మంత్రి హరీష్ రావు ధన్యవాదాలు తెలిపారు. ఐటి టవర్ నిర్మాణంతో జిల్లాలోని వేలాది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపారు. ఈ నెల 10 వ తేదీన ఐటి టవర్ నిర్మాణం రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్ర శేఖర్ రావు చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సమక్షంలో ఇన్ఫోసిస్ సహా పలు ప్రముఖ ఐటి సంస్థలతో MOU చేసుకోనున్నారు ఐటి శాఖ ఉన్నతాధికారులు.

- Advertisement -