భర్త కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా కాజల్..

148
Kajal
- Advertisement -

హీరోయిన్ కాజల్ అగర్వాల్ ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయనతో కలిసి ఆమె హనీమూన్‌లో ఎంజాయ్ చేసింది. గౌతమ్‌ ప్రముఖ డిజైనింగ్‌ కంపెనీ అధినేత. ఇప్పుడు ఆయన కంపెనీని ప్రమోట్ చేసే బాధ్యతలను కాజల్ తన భుజాలపై వేసుకుంది. గౌతమ్ ఈ కామర్స్‌ సంస్థ డిస్కర్న్‌ లివింగ్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోయింది.

కిచ్లుకి సంబంధించిన ఇ-కామర్స్ సంస్థ డిస్కర్న్ లివింగ్‌కి ఎండోర్స్‌మెంట్ మొదలు పెట్టింది కాజల్. ఈ సంస్థ కోసం కాజల్ చేస్తున్న యాడ్స్ కూడా త్వరలోనే ప్రసారం కానున్నాయి. ఈ క్రమంలోనే కాజల్ కూడా తన భర్త కంపెనీకి సంబంధించిన డిజైనింగ్ గురించి ట్వీట్స్ చేస్తుంది.

ఆ బ్రాండ్‌ పబ్లిసిటీ బ్రోచర్స్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు కాజల్‌ తన ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె పోస్ట్ చేసింది. ప్రస్తుతం కాజల్ వరస సినిమాలు కూడా చేస్తుంది. ఈ క్రమంలోనే త్వరలోనే చిరంజీవి ఆచార్య షూటింగ్ కోసం హైదరాబాద్ రానుంది కాజల్ అగర్వాల్. దాంతో పాటు తమిళ సినిమాలకు కూడా డేట్స్ ఇచ్చింది కాజల్.

- Advertisement -