ఫ్రాన్స్‌లో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందన్నారు ఆ దేశ ప్రధానమంత్రి జీన్ కాస్టెక్స్. ఈ మేరకు పార్లమెంట్‌కు వివరాలను వెల్లడించిన కాస్టెక్స్..నెలన్నర వ్యవధిలో కేసులు భారీగా పెరిగాయని, గతవారంతో పోలిస్తే 4.5శాతం కేసులు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు.
ఒకే రోజు ఫ్రాన్స్ వ్యాప్తంగా మహమ్మారికి 408 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 91,196కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4.11 మిలియన్లకు చేరగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులున్న దేశాల్లో ఆరో స్థానంలో ఉంది.
కొత్తగా నమోదవుతున్న కేసులతో దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఆసుపత్రి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని, లాక్‌డౌన్‌ను మాత్రం తప్పించవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. భద్రతా సమస్యల నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పంపిణీని ఫ్రాన్స్ ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో టీకా పంపిణీ మరింత జాప్యం కానుంది.