మత సామరస్యానికి నెలవు…నెల్లూరు రొట్టెల పండుగ

61
rottela
- Advertisement -

మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే నెల్లూర్‌ బారాషహీద్‌ దర్గా వద్ద రొట్టెల పండుగ మంగళవారం ప్రారంభమైంది. అయితే గత రెండేళ్లగా కరోనా వల్ల ఈ రొట్టెల పండుగ నిర్వహించలేదు. అయితే ఈ సారి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 13వ తేదీ వరకు జరిగే ఈ పండుగ కోసం నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ పండుగకు కుల మతాలకు అతీతంగా ప్రపంచం నలుమూలల నుంచి భారీగా తరలి వస్తున్నారు. భక్తులు స్వర్ణాల చెరువులో రొట్టెలు వదిలి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

ఈ రొట్టెల పండుగలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఆర్కాటు నవాబు కోరిక నెరవేరడంతో మరుసటి ఏడాది దర్గాకు వచ్చి కృతజ్ఞత తెలియజేస్తూ, స్వర్ణాల చెరువులో రొట్టె విడిచినట్లు ఒక కథనం. ఆ సంఘటనానంతరమే రొట్టెల పండుగ మొదలైందని పెద్దలు చెపుతుంటారు. 1930 లలో ఈ రొట్టెల పండుగ మొదలై క్రమం తప్పకుండా జరుగుతూ, స్థానిక పత్రికల ద్వారా ప్రచారం జరుగుతుంది. భక్తులు ఇంటిలో తయారు చేసుకొచ్చిన చపాతీలు (రొట్టెలు) చెరువు లోని నీళల్లో దిగి తలపై ముసుగు వేసుకొని మార్పిడి చేసుకుంటారు. విద్యా రొట్టె, పెళ్ళి రొట్టె, సౌభాగ్య రొట్టె, సంతాన రొట్టె, వీసా రొట్టె, అభివృద్ధి రొట్టె, సమైక్యాంధ్ర రొట్టె…ఇలా ఎన్నోరకాల రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటారు. వివిధ కోర్కెలకు సంబంధించి స్వీకరించుకున్న రొట్టెలకు బదులుగా తిరిగి మరుసటి సంవత్సరం ఒకటికి రెండు రొట్టెల చొప్పున ఈ స్వర్ణాల చెరువు వద్ద భక్తులకు పంచుతారు. మిగిలిన వాటిని ఈ చెరువులో వదిలేస్తారు.

- Advertisement -