బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన కన్నడ చిత్రం కేజీఎఫ్‌లో విలన్‌గా నటిస్తూనే, పానిపట్ అనే చారిత్రాత్మక చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అలగే తెలగులోను బాలయ్య సినిమాలో విలన్‌గా నటిస్తారని తెలుస్తోంది. సంజయ్ ఇటీవల తన ఫ్రెండ్స్ రుషి కపూర్, నీతూ కపూర్‌ను కలిసేందుకు ముంబైలోని వాళ్లింటికి వెళ్లాడు. అక్కడ వారితో ఆనందంగా గడిపాడు.
అయితే సంజయ్ దత్‌తో తాము ఆనంద క్షణాల్ని గడిపామంటూ… నీతూ… ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దానికి మెసేజ్ కూడా రాసింది. ఫ్రెండ్స్ వచ్చి పలకరిస్తే సంతోషకరమైన ఫీలింగ్… వాళ్లు మనల్ని ఎంతలా అభిమానిస్తున్నారో, ఎంతలా మిస్సవుతున్నారో తెలుస్తుంది అని రాసింది. ఈ ఫొటో చూసి 67 ఏళ్ల రుషి కపూర్, 60 ఏళ్ల సంజయ్ దత్ సంతోషపడ్డారు.
ఇక అసలు విషయం ఏంటంటే ఈ ఫోటోలో సంజయ్ దత్ కళ్లు మూసుకొని, నీరసంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు. దీంతో ఆయన ఆరోగ్యంపై నెటిజన్లకు అనుమానాలు కలుగుతున్నాయి. సంజయ్ బాబాకి ఎలా ఉంది అని ఒకరు అడగ్గా… సంజు సార్ చాలా వీక్‌గా ఉన్నారు, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారా అని మరొకరు అడిగారు. సంజు చాలా ఓల్డ్‌గా కనిపిస్తున్నారని ఇంకొకరి కామెంట్. ఆ పానిపట్ నటుడికి సంబంధించి మంచి ఫొటో పోస్ట్ చెయ్యమని మరో నెటిజన్ కోరారు. ఇలా సంజయ్ ఫోటోపై పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.