- Advertisement -
త్వరలో జరగబోయే ఉప రాష్ట్రపతి ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం యొక్క ఎన్‌డీయే ఆభ్యర్థిగా జగదీప్ ధనఖర్‌ను బీజేపీ ప్రకటించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశములో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ, జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్ పాల్గోన్నారు. కాగా ప్రస్తుతం జగదీప్ ధనఖర్ పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. జూలై 19న చివరి నామినేషన్ తేది ముగుస్తుంది. కాగా ఆగస్టు 6నాడు ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పనిచేస్తున్నారు.
- Advertisement -