- Advertisement -
దివంగత మాజీ హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి భార్య అహల్య (68) సోమవారం నాడు మృతి చెందారు. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అహల్య తుదిశ్వాస విడిచారు. కరోనా పాజిటివ్ రావటంతో నాయిని నర్సింహారెడ్డితోపాటు అహల్య అపోలో ఆస్పత్రిలో చేరారు. కరోనా నెగెటివ్ వచ్చినా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉండటంతో చికిత్స పొందుతూ..నేడు తుదిశ్వాస విడిచారు.కాగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 21వ తేదీన రాత్రి నాయిని నర్సింహ్మారెడ్డి కన్నుమూసిన విషయం విదితమే.
- Advertisement -