ఎస్సీ, ఎస్టీల అభ్మునతికి ప్రభుత్వం కృషి చేస్తుంది..

236
- Advertisement -

ఎస్సీ, ఎస్టీల అభ్మునతికి రాష్ట్ర ప్రభుత్వం అంకితభవంతో పని చేస్తుందిని, బంగారు తెలంగాణ సాధించడానికి కృషి చేస్తుందని, శాసన మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ అన్నారు. బుధవారం బషీర్‌బాగ్‌లో పరిశ్రమ భవన్ 3వ అంతస్తులో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్‌ నూతన కార్యలయన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ ఆలితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జీ. వివేక్‌, బీసీ కమీషన్‌ ఛైర్మన్‌ రాములు, ఎస్సీ కార్సొరేషన్‌ ఛైర్మన్‌ పిడపర్తి రవి ఇతర ప్రముఖులు పాలొన్నారు.

Deputy Chief Minister Mahmood Ali

ఈ సందర్భంగా ఛైర్మన్‌ సామిగౌడ్‌ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలు సమాజంలో గౌరవంగా ఉండేందుకు ప్రభుత్వం అన్నిరకాల సదుపాయాలను కల్పిస్తుందని రాష్ట్రస్థాయిలో ఎస్సీ, ఎస్టీ కమీషన్‌ కార్యకలపాలను నూతన భవనం గౌరవ ముఖ్యమంత్రి కేటాయించడం అభినందనీయం అన్నారు. ప్రభుత్వం పూర్తి సహాయ సహాకారాలు అందిస్తుందన్నారు.

Minister Talasani Srinivas Yadav

ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ ఆలి మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు నూతన కార్యలయ భవనం కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో అభివృద్ధి చెందేలా ప్రభుత్వం పని చేస్తుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లందరికి అన్ని సదుపాయాలు కల్సించి వారి అభివృద్ధికి సహాకరిస్తుందన్నారు. విద్యార్ది దశ నుండే తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన డా. ఎర్రోల్ల శ్రీనివాస్‌ను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్‌ ఛైర్మన్‌గా నియమించారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేసేలా సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వం పోలీసు శాఖ తరపున సంపూర్ణ సహాయ సహాకారాలు అందిస్తామని హామీ ఇస్తున్నామన్నారు.

SC, ST Commission's Office inauguration program

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్‌ ఛైర్మన్‌ ఎర్రోల్ల శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. 2003 సంవత్సరం నుండి కమిటీ ఏర్పడిందని ఉమ్మడి రాష్ట్రంలో గుర్తింపు పొందలేదని, తెంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రాముఖ్యత సంతరించుకొని ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి కమిటీ కృషి చేస్తుందన్నారు. నూతన భవనం కేటాయింపుపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలపై జరిగే అన్యాయాలు, అత్యాచారలు జరగకుండా కమిటీ కాపాడుతుందని, ఒక ఛైర్మన్‌గానే కాకుండా ఒక సేవకునిగా అంకిత భవంతో పని చేస్తానని అన్నారు. అట్రాసిటీ కేసులలో బాధితుల సమస్యలు పరిష్కరించుటకు అన్ని జిల్లాలలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలలో చైతన్యం తెచ్చి, వారికి బంగారు తెలంగాణ ఫలితాలు అందించడమే కమీషన్‌ కర్తవ్యమని ఎర్రోల్ల శ్రీనివాస్‌ వివరించారు.

Nayani Narasimha Reddy

- Advertisement -