వారాహి బ్యానర్‌లో కీరవాణి తనయుడు..

44
ss rajamouli

సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి మత్తువదలరా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా తరువాత ఎన్నో కథలు విన్న శ్రీ సింహ కోడూరి ఈ కథను లాక్ చేశాడు. నూతన దర్శకుడు మనికాంత్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. నిర్మాత సాయి కొర్రపాటితో కిలిసి రజిని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వారాహి చలనచిత్రం ఎంటర్టైన్మెంట్స్, లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్వరలో టైటిల్ ను ప్రకటించబోతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.

హీరోయిన్స్ చిత్ర శుక్ల, మిషా నారంగ్ ఈ సినిమాలో సింహ కోడూరి సరసన నటిస్తున్నారు. చిత్ర ప్రారంభోత్సవంలో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా తొలి షాట్ కు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి క్లాప్ కొట్టడం జరిగింది, అలాగే ఎమ్.ఎమ్.కీరవాణి స్క్రిప్ట్ ను చిత్ర యూనిట్ కు అందజేశారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కాళబైరవ సంగీతం అందిస్తున్నాడు. సురేష్ రగుతూ కెమెరామెన్ గా వర్క్ చేస్తున్న ఈ సినిమాకు సత్య గిడుతురు ఎడిటర్. నాగేంద్ర పిల్ల ఈ మూవీకి కథ అందిస్తున్నారు.

నటీనటులు:
శ్రీ సింహ కోడూరి, చిత్ర శుక్ల, నిషా నారంగ్

సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: మనికాంత్ గెల్లి
నిర్మాతలు: రజిని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పానేని
ప్రొడక్షన్: సాయి కొర్రపాటి ప్రొడక్షన్స్
బ్యానర్స్: వారాహి చలన చిత్రం, లౌక్య ఎంటర్త్సైన్మెంట్స్
మ్యూజిక్: కాళబైరవ
డిఓపి: సురేష్ రగుతు
స్టొరీ: నాగేంద్ర పిల్ల
ఎడిటర్: సత్య గిడుతురి