- Advertisement -
గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న విఘ్నేష్ శివన్ నయనతార పెళ్లి త్వరలోనే జరగనుంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ కాగా వివాహా తేదీని గుర్తుంచుకోండి. జూన్ 9, 2022న ఘనంగా వెడ్డింగ్ జరగనుంది అనే సమాచారంతో కార్డు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది.
తమిళనాడులోని మహాబలిపురంలో ఓ రిసార్ట్ లో ఘనంగా జరగనుంది. ఈ వివాహా వేడుకకు దగ్గరి బంధువులు, సన్నిహితులు మాత్రం హాజరు కానున్నట్టు తెలుస్తోంది.గతంలోనే ఇన్విటేషన్ కార్డును వీరు సందర్శించిన పలు దేవాలయాల్లో స్వామివారి పాదాల వద్ద ఉంచి, ప్రత్యేక పూజాలు కూడా చేయించారు.
గతేడాది బంధుమిత్రలు, సన్నిహితుల మధ్య ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. నయనతార ఇటీవవల తమిళ మూవీ ‘కాతు వాకుల రెండు కాదల్’ చిత్రంలో నటించింది. ప్రస్తుతం తెలుగులో ‘గాడ్ ఫాదర్’లోనూ నటిస్తోంది.
- Advertisement -