నటిగా పేరు తెచ్చుకోవడమే నాకిష్టం!

38
- Advertisement -

టైమ్స్ 100 జాబితాలో చోటు దక్కించుకుంది దీపికా. ఈ సందర్భంగా మాట్లాడిన దీపికా… హాలీవుడ్‌లో చిన్నచిన్న వేషాలు వేయడం కంటే ఇక్కడే ఉండి మంచినటిగా పేరు తెచ్చుకోవడమే నాకిష్టం అని తెలిపింది.నాలోని నటికి కాకుండా నాలోని శక్తిమంతురాలైన స్త్రీకి ఈ గుర్తింపు ఇచ్చారు. నేను పద్దెనిమిదేండ్లకే మోడల్‌గా నా ప్రయాణం మొదలుపెట్టానని తెలిపింది.

నేను అథ్లెట్‌ని అని అందరికి తెలిసిందే. నా తండ్రి ప్రకాశ్‌ పదుకొనె నుంచి ఆట నాకు వారసత్వంగా వచ్చింది. అందుకే నా శరీరాన్ని, మనసును ఎలా అదుపులో ఉంచుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పుకొచ్చింది.

ఇటీవలే కాన్స్ ఫిలిం ఫెస్టివల్ జ్యురి మెంబర్ గా కూడా ఉండి మన దేశానికి ఎంతో వన్నె తెచ్చింది. కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో రకరకాల డ్రెస్సులతో రెడ్ కార్పెట్ పై అలరించింది.

- Advertisement -