హర్యానా సీఎంగా నాయబ్ సింగ్

18
- Advertisement -

హర్యానా కొత్త సీఎంగా నాయబ్ సింగ్ సైనీని ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. ఇవాళ సాయంత్రం 5 గంటలకు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు నాయబ్. మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామాతో కొత్త సీఎం ఎంపిక అనివార్యమైంది.

నాయబ్ సింగ్ ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా కురుక్షేత్ర నియోజకవర్గం నుండి ఎంపీగా కొనసాగుతున్నారు. 1996లో బీజేపీలో చేరారు సైనీ. 2005లో అంబాలాలో జిల్లా బీజేపీ అధ్యక్షునిగా ,2009లో కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

2014లో నారాయణ్‌గఢ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. 2019లో ఎంపీగా గెలిచారు. 2023 అక్టోబర్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

Also Read:TDP:పొత్తు ఎఫెక్ట్.. ‘లెక్కలు’ ఛేంజ్!

- Advertisement -