మూడు సెకన్లు ఆలస్యమైతే..అందరి ప్రాణాలు గాల్లో…

220
chopper
- Advertisement -

ఓ పైలట్‌ చాకచక్యం 26 మందిని కాపాడింది. కెరళ వరద బాధితులను ప్రాణాలకు తెగించి కాపాడాడు ఆ పైలట్. దానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అంతేకాదు. పైలట్‌ ధైర్యసాహసాలకు ప్రసంశలు వెల్లువెత్తుతున్నాయి.

చాలకుడి ప్రాంతంలోని వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు నావీకి చెందిన 42బీ హెలికాప్టర్‌ను ఓ ఇంటిపై(రూఫ్‌టాప్‌) చాకచక్యంగా ల్యాండ్‌ చేసి 26 మంది ప్రాణాలను రక్షించాడు పైలట్‌ . మూడు సెకన్లు ఆలస్యమైతే..అందరి ప్రాణాలు గాల్లోకలిసేవి. అయితే పోయిన శుక్రవారం జరిగిన ఈ ఘటన గురించి ఆ డేర్‌డెవిల్‌ పైలట్‌ మాట్లాడుతూ.. ‘ఆ ఇంటిపై హెలికాప్టర్‌ బరువు పడకుండా కేవలం టైర్లు మ్రాతమే ఉండేలా ల్యాండ్‌ చేశా. 8 నిమిషాల్లో సహాయ సిబ్బంది ఆ 26 మందిని హెలికాప్టర్‌లోకి ఎక్కించేశారు.’ ఆ వెంటనే టేకాఫ్‌ తీసుకున్నానని చెప్పుకొచ్చారు. ఏదైన జరగకూడనిది జరిగితే అని ప్రశ్నించగా.. ‘ఓ మూడు సెకన్లు ఆలస్యమైతే హెలికాప్టర్‌ ముక్కలవుతోందని తెలుసు. అది నాకు కఠిన సవాల్‌. కానీ నేను తీసుకునే నిర్ణయం సరైనదేనని నమ్మాను. ఇలాంటి పరిస్థితుల్లో పైలట్‌ అవసరమెంటో తెలుస్తోంది.’ అని చెప్పుకొచ్చారు.

https://www.youtube.com/watch?v=Quxr5GU24yU

- Advertisement -