కెరళకు.. ఫేస్‌బుక్‌ సాయం..ఎంతో తెలుసా..?

213
Kerala Floods

వరదల వలయంలో చిక్కుకున్న కెరళ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ప్రపంచమంతా కదలివస్తోంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాల నుంచి ..కొన్ని దిగ్గజ కంపెనీలు, వ్యాపారవేత్తలు, సినీసెలబ్రిటీల నుంచి తోచినంత సాయం చూస్తూ..కెరళ ప్రజలకు అండగా ఉంటున్నారు.

 Facebook అయితే తాజాగా వారితో పాటు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్‌ కూడా తోడైంది. 2,50,000 డాలర్లను అంటే 1.75 కోట్ల రూపాయలను ఫేస్‌బుక్‌ కెరళ ప్రజలకు విరాళంగా ప్రకటించింది. కాగా.. వీటిని వరదల్లో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల బాధితులకు అందజేయనున్నట్టుగా పేర్కొంది. కమ్యూనిటీ రెసిలియన్స్‌ ఫండ్‌ గూంజ్‌ ద్వారా ఈ నగదును విరాళంగా అందజేయనున్నట్టు వెల్లడించింది. ఇది ఢిల్లీకి చెందిన లాభపేక్షలేని సంస్థ.

ఇదిలా ఉండగా..దేశవ్యాప్తంగా కెరళ కోసం భారీ ఎత్తున విరాళాల సేకరణ జరుగుతోంది. వారికి కావాల్సిన ఆహారాన్ని, దుస్తులను కూడా సహాయక బృందాలు,ఎస్‌జీవోల ద్వారా తరలిస్తున్నారు.