కెరళకు 500 టన్నుల బియ్యం..

209
- Advertisement -

కష్టకాలంలో కెరళ ప్రజలను ఆదుకునేందుకు ఎంతో మంది ముందుకొస్తున్న విషయం తెలిసిందే. వరదల్లో చిక్కుకున్న కెరళను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.25 కోట్ల తక్షణ సహాయాన్ని ప్రకటించింది.

అయితే తాజాగా 500 టన్నుల బియ్యన్ని పంపనుంది తెలంగాణ ప్రభుత్వం. వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఆహారం సరఫరా చేయడానికి బియ్యం పంపాలని కెరళ రాష్ట్రం నుంచి వచ్చిన విజ్ఞప్తికి సీఎం కేసీఆర్ వెంటనే స్పందించారు. కాగా సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పౌరసరఫరాలశాఖ మం త్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్‌లతో మాట్లాడారు. రాష్ట్ర అధికారులు కేరళకు రూ.కోటి విలువైన 500 టన్నుల బియ్యాన్ని ఈ నెల 22న 30 ట్రక్కుల్లో రోడ్డుమార్గంలో పంపించాలని నిర్ణయించారు.

 Telangana

ఇదిలా ఉండగా..భారీ వర్షాలతో అతలాకుతలమైన తన రాష్ట్రానికి ఆపన్న హస్తం అందించినందుకు తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావుకు కేరళ సీఎం పినరాయి విజయన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్‌కు విజయన్ లేఖ రాశారు.

- Advertisement -