నాగ‌శౌర్య ‘@న‌ర్త‌న‌శాల’లో సాంగ్ రిలీజ్..

392
@Nartanasala Egireney Manasu Full Video Song
- Advertisement -

ఛ‌లో లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ కాంబినేష‌న్ లో ప్రొడ‌క్ష‌న్ నెం-2 గా తెర‌కెక్కుతున్న చిత్రం @న‌ర్త‌న‌శాల. శంకర ప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మాత. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడు. క‌ష్మిర ప‌ర‌దేశి, యామిని భాస్క‌ర్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఛ‌లో లాంటి మ్యూజికల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందించిన మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. . భాస్కర భట్ల రచించిన ఎగిరెనే మనసు అనే ఫుల్ సాంగ్ వీడియో లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రాన్ని అగ‌ష్టు 30న విడుదల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత ఉషా మూల్పూరి మాట్లాడుతూ.. ఛ‌లో చిత్రాన్ని మ్యూజిక‌ల్‌గా ఎంత ఘ‌న‌విజ‌యం చేశారో అంద‌రికి తెలుసు. ఇప్ప‌డు మా @న‌ర్త‌నశాలని కూడా అంత‌కు మించి విజ‌యం చేయాల‌ని కోరుకుంటున్నాను. ఛలో చిత్ర విజయంలో పాత్రకేయ మిత్రుల పాత్ర ఎంతో ఉంది. ఈ చిత్రాన్ని అగ‌ష్టు 30న విడుదల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము. ఈ సినిమాకు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సాగర్‌, భాస్కరభట్ల, విజయ్ మాస్టర్‌, తమ్మిరాజు, చంటిలకు స్పెషల్‌గా థాంక్స్ తెలియజేస్తున్నాను. అని అన్నారు.

@Nartanasala Egireney Manasu Full Video Songచిత్ర సమర్పకులు శంకర ప్రసాద్ మాట్లాడుతూ… ఛలో సినిమా నిర్మించేందుకు నిర్మాతలు ముందుకు రాకపోవడంతో… ఐరా క్రియేషన్స్ పుట్టింది. ఐరా క్రియేషన్స్‌కి నలుగురు పిల్లర్స్. ఒకరు ఆర్టిస్టులు, రెండు టెక్నీషియన్స్, మూడు మీడియా, నాలుగు తమ్మిరాజు, చంటి. అని అన్నారు. చిత్ర లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి మాట్లాడుతూ… ఛలోకు ఇచ్చిన సపోర్టే నర్తనశాలకు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అని అన్నారు.

పాట రచయిత భాస్కరభట్ల మాట్లాడుతూ… ఐరా క్రియేషన్స్‌ను సొంత బ్యానర్ కింద ఫీలవుతాను. వాళ్లు కూడా నన్ను సొంత రైటర్‌లా ఫీలవుతారు. అందుకే మంచి రిలేషన్ మెయింటైన్ అవుతోంది. దర్శకుడు శ్రీనివాస్ మంచి మిత్రుడు. ఆయనకు ఐరా క్రియేషన్స్‌లో అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. మంచి రచయిత. ఆయనకు ఆల్ ది బెస్ట్. మహతి సాగర్‌తో ఛలో చిత్రంలో చూసి చూడంగానే తర్వాత ఎగిరెనే అనే పాట రాశాను. నాకు చాలా చాలా ఇష్టమైన పాట. మాది హిట్ కాంబినేషన్‌గా కొనసాగుతుంది. మంచి సిచువేషన్‌లో వచ్చే సాంగ్ ఇది. సినిమా రిలీజ్ కు ముందే ఫుల్ సాంగ్ రిలీజ్ చేసేందుకు గట్స్ కావాలి. సినిమా పెద్ద హిట్ అవుతుందని సూచన ప్రాయంగా చెప్పేశారు. అని అన్నారు.

Nartanasala Movie

మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ మాట్లాడుతూ… నా డార్లింగ్ శౌర్య నా పెద్ద సపోర్ట్. శంకర్ ప్రసాద్, ఉష టెక్నీషియన్స్‌కి ఇచ్చే రెస్పెక్ట్ అమేజింగ్. ఛలో తర్వాత నన్నే మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంచుకున్నారు. ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలి. డైరెక్టర్ శ్రీనివాస్ ఫ్రీడమ్, స్పేస్ ఇచ్చారు. భాస్కర్ భట్ల చూసి చూడంగానే అనే పెద్ద హిట్ ఇచ్చారు. ఈ సాంగ్ కూడా అంతే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు. మా టెక్నీషియన్స్ అందరికీ చాలా చాలా థాంక్స్. ఎగిరెనే సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. సూపర్ హ్యాపీ. అని అన్నారు.

డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ… ఫస్ట్ లుక్ నుంచి ఫుల్ సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి… ఉషాకి, శంకర్ ప్రసాద్‌కి, బుజ్జికి చాలా చాలా థాంక్స్. శౌర్య ఈ రోజు ఇక్కడ లేడు. ఆయన ఉంటే ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంటాం. నేను సినిమా మొదలు పెట్టినప్పుడు ఇంత పెద్ద సినిమాగా అవుతుందనుకోలేదు. ప్రతీ రోజు పండగ లాగానే జరిగింది. ఈ సాంగ్ కోసం జర్నీ చేశాం. అరగంటలో మహతి ఈ ట్యూన్ ఇచ్చేశారు. నాకు సాగర్ రూపంలో మంచి టెక్నీషియన్ దొరికారు. మెలోడి అనగానే మాకు గుర్తొచ్చే మనిషి భాస్కర భట్ల గారు. సింగిల్ వెర్షన్‌లో సాంగ్ ఇచ్చారు. సౌండ్ డిపార్ట్‌మెంట్‌కి చాలా చాలా థాంక్స్. డిఓపి విజయ్ పండగలా తీసిచ్చారు.

Nartanasala Movie

సినిమా అంతా కూడా అలాగే ఉంటుంది. విజువల్స్‌ని అంత బ్యూటిఫుల్‌గా మలిచారు. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ బ్యాక్ గ్రౌండ్‌లో సూపర్బ్ వర్క్ చేశారు. పద్మశ్రీ యాడ్స్ నుంచి సూపర్బ్ డిజైన్స్ చేసిచ్చారు. విజయ్ మాస్టర్ అద్భుతమైన కొరియోగ్రఫి అందించారు. తమ్మిరాజు ,చంటి గారికి చాలా థాంక్స్. నాగశౌర్య, కష్మీరా, యామిని స్క్రీన్ మీద మ్యాజిక్ చేశారు. హీరోయిన్ యామినీ మాట్లాడుతూ… ఐరా క్రియేషన్స్ ఒక ఫ్యామిలీ లా ఉంటుంది. మా డైరెక్టర్‌కి చాలా థాంక్స్. సాగర్ థాంక్యూ సో మచ్. ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. మీడియా సపోర్ట్ కావాలి. నర్తనశాల అందరూ గుర్తుపెట్టుకునే సినిమా అవుతుంది.

న‌టీన‌టులు..నాగ‌శౌర్య‌, క‌ష్మర ప‌ర‌దేశి, యామిని భాస్క‌ర్‌, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, అజ‌య్‌, శివాజి రాజ‌, సుధ‌, ప్రియ‌, జెమిని సురేష్‌, రాకేట్ రాఘ‌వ‌, స‌త్యం రాజేష్‌, రాఘ‌వ‌, ఉత్తేజ్‌, తిరుప‌తి ప్ర‌కాష్‌, ప‌ద్మ జ‌యంతి, మాధురి త‌దిత‌రులు న‌టించ‌గా.. క‌థ‌-స్క్రీన్‌ప్లే-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వం.. శ్రీనివాస్ చ‌క్ర‌వ‌ర్తి, నిర్మాత‌.. ఉష మూల్పూరి, లైన్ ప్రోడ్యూస‌ర్‌.. బుజ్జి, ఐరా డిజిట‌ల్‌– ఎమ్‌.ఎన్‌.ఎస్ గౌత‌మ్‌, డి ఓ పి.. విజ‌య్ సి కుమార్‌, సంగీతం.. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్, ఎడిట‌ర్‌.. కొట‌గిరి వెంక‌టేశ్వ‌రావు, త‌మ్మిరాజు, స్క్రిప్ట్ అసోసియోట్‌.. కాశి న‌డింప‌ల్లి, పిఆర్ ఓ .. ఏలూరు శ్రీను, ప‌బ్లిసిటి డిజైన‌ర్‌.. అనంత్‌, ఆర్ట్‌.. కిర‌ణ్ కుమార్ మ‌న్నె,ఫైట్స్‌.. విజ‌య్ , మ‌ల్లేష్‌, కొరియోగ్ర‌ఫి.. విశ్వ ర‌ఘు, విజ‌య్ ప్ర‌కాష్‌, లిరిక్స్‌.. భాస్క‌ర‌భ‌ట్ల ర‌వికుమార్‌, శ్రీమ‌ణి, ఒరుగం.

https://youtu.be/pII6-QC_3QM

- Advertisement -