రొమాంటిక్ మోడ్‌లో నాగశౌర్య-షిర్లీ..!

93
Naga Shaurya
- Advertisement -

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య తాజాగా న‌టించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. అనీష్ ఆర్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇప్ప‌టికే చిత్రం నుంచి విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ ప్రేక్ష‌కుల‌లో అంచనాలు న‌మోదు చేశాయి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటుంది. ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం మే 20న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం ఏదో ఒక అప్‌డేట్‌తో ప్రేక్ష‌కుల అటెన్ష‌న్‌ను సినిమావైపు తిప్పుకుంటుంది.

తాజాగా ఈ చిత్రంలోని ఏముందిరా అనే పాట‌ను బుధ‌వారం విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియాలో పంచ‌కున్నారు. ఇందులో నాగశౌర్య-షిర్లీ సెటియా రొమాంటిక్ మోడ్ లో కనిపిస్తున్నారు. కృష్ణ చేతుల్లో విహారి ఆద్యంతం ఆకట్టుకుంటుంది. నిక్కరేసిన షిర్టీ బుట్టబొమ్మలా ఉంది. జీన్స్ నిక్కరు..పచ్చ రంగు బుట్ట భుజాల జాకెట్..మెడలో జ్యూవెలరీ..కళ్లకి అద్దాల ఆహార్యంలో షిర్లీ సెటియా ఆకర్షణీయంగా ముస్తాబైంది.

ఇక నాగశౌర్య బ్లాక్ షర్ట్ ..ఫ్యాంట్ లో కనిపిస్తున్నాడు. ప్రియురాల్ని చేతుల్లోకి తీసుకుని ముద్దాడబోతున్నాడు. ఈ పోస్టర్ సాంగ్ షూట్ లో కట్ లా కనిపిస్తుంది. నెట్టింట పోస్టర్ వైరల్ గా మారింది. ప్రస్తుతం యూనిట్ లిరికల్ సింగిల్స్ ని ఒక్కోక్కటిగా రిలీజ్ చేస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చింది.

డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ ట్రైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తుండగా, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి సాయిశ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ రాధిక ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

- Advertisement -