నాని వాయిస్‌…ఈ మాయ పేరేమిటో

378
Nani
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున‌, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు వంటి స్టార్స్ అంద‌రూ వారి న‌ట‌న‌తోనే కాదు.. వారి గొంతుక‌తో కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటారు. సినిమా అవ‌శ్య‌క‌త‌ను బ‌ట్టి వాయిస్ ఓవ‌ర్ ఇచ్చి ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్స్‌కు ర‌ప్పిస్తుంటారు. ఇప్ప‌టికే అ! చిత్రం స‌హా ప‌లు చిత్రాల‌కు వాయిస్
ఓవ‌ర్ ఇచ్చిన నేచుల‌ర్ స్టార్ నాని యువ క‌థానాయ‌కుడు రాహుల్ విజ‌య్ న‌టించిన ఈ మాయ పేరేమిటో చిత్రానికి వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌నున్నారు.

ముప్పై ఏళ్లుగా తెలుగు సినిమాల్లో ఎంతో మంది స్టార్స్‌కు అద్భుతమైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడే రాహుల్ విజ‌య్‌. ఈయ‌న క‌థానాయ‌కుడిగా, కావ్యాథాప‌ర్ క‌థానాయ‌కిగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్‌ బేనర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రానికి రాము కొప్పుల దర్శకుడు. దివ్య విజయ్‌ నిర్మాత. ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొదుతోన్న ఈ చిత్రం ఫ‌స్ట్‌లుక్‌, టీజ‌ర్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది.

రాహుల్ విజ‌య్‌, కావ్యా థాప‌ర్ జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ముర‌ళీశ‌ర్మ‌, రాళ్ల‌ప‌ల్లి, ఈశ్వ‌రీరావు, ప‌విత్రా లోకేశ్‌, స‌త్యం రాజేశ్‌, జోశ్ ర‌వి, కాదంబ‌రి కిర‌ణ్ త‌దిత‌రులు ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్స్‌: విజయ్‌, ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి, ఆర్ట్‌: చిన్నా, సాహిత్యం: శ్రీమ‌ణి, సంగీతం: మ‌ణిశ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫీ: శామ్ కె.నాయుడు, నిర్మాత‌: దివ్యా విజ‌య్‌, ద‌ర్శ‌క‌త్వం: రాము కొప్పుల.

- Advertisement -