నాని, సుధీర్ బాబు ల `వి` చిత్రం ప్రారంభం

301
Sudheer babu Nani
- Advertisement -

నేచుర‌ల్ స్టార్ నాని, హీరో సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, నివేదా థామ‌స్ హీరో హీరోయిన్లుగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.36 చిత్రం `వి` సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్‌, ల‌క్ష్మ‌న్‌, హ‌ర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌కుడు. దిల్‌రాజు, శిరీష్, ల‌క్ష్మ‌ణ్‌ ఆధ్వ‌ర్యంలో పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రిగాయి. ముహూర్త‌పు స‌న్నివేశానికి ద‌ర్శ‌కుడు `ఎంసిఎ` డైరెక్ట‌ర్ శ్రీరామ్ వేణు క్లాప్ కొట్ట‌గా.. `నేను లోక‌ల్‌` ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన కెమెరా స్విచ్ఛాన్ చేశారు. `ఎఫ్‌2` డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త్వ‌ర‌లోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

- Advertisement -