గ్యాంగ్‌ లీడర్‌తో గ్యాంగ్‌ లీడర్‌..సేమ్ టు సేమ్‌..!

536
chiru nani
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రాజకీయాలకు అతీతంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బాలీవుడ్,కోలీవుడ్ ప్రముఖులు సైతం చిరుకు విషెస్ చెప్పగా నేచురల్ స్టార్ నాని సైతం చిరుకు స్పెషల్ గ్రీటింగ్స్ చెప్పారు.

ప్రస్తుతం నాని గ్యాంగ్ లీడర్‌ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవిని మాస్‌హీరోగా నిలబెట్టిన సినిమాల్లో ఒకటి గ్యాంగ్‌లీడర్‌. ఈ మూవీలో చిరు డ్రెస్సింగ్ ,స్టైల్‌, నటన, డ్యాన్స్‌లు, ఫైట్‌లు ప్రేక్షకులను రంజింపచేశాయి. తాజాగా అదే టైటిల్‌తో వస్తున్న నాని ఓ స్పెషల్ పోస్టర్‌ని విడుదల చేశారు.

ఇందులో నాని కూడా చిరంజీవిలా గ్యాస్‌లైటర్‌ పట్టుకుని దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆనాటి క్లాసిక్‌ గ్యాంగ్‌లీడర్‌ను గుర్తు చేసుకుంటూ అభిమానులకు మేమిస్తున్న ఘనమైన కానుక అంటూ నాని తెలిపారు. ఎప్పటికీ మీరే మా గ్యాంగ్‌లీడర్‌ అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -