‘సాహో’ సెన్సార్ పూర్తీ…ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే

550
Sahoo censor
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సాహో. బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ ప్రభాస్ సరసన నటించింది. జాకీష్రాఫ్,మందిరా బేడి, నీల్ నితిన్ ముఖేష్,చుంకీ పాండే, అరుణ్ విజయ్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈచిత్రం ట్రైలర్ ను ఇటివలే విడుదల చేశారు. ఆగస్ట్ 30న విడుదల కానున్న ఈసినిమా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున చేస్తున్నారు చిత్రయూనిట్.

తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈసినిమాను విడుదల చేస్తున్నారు. తాజాగా ఈచిత్రం సెన్సార్ ను పూర్తి చేసుకుంది. యు/ఏ సర్టిఫికేట్ ను ఇచ్చారు. ఈసినిమా చూసిన సెన్సార్ సభ్యులు చిత్రయూనిట్ ను ప్రశంసిస్తున్నారట.

హాలీవుడ్ రేంజ్ లో సినిమాను తెరకెక్కించారని చిత్రయూనిట్ ను అభినందించారని సమచారం. ఇండియన్ సినిమాల్లో ఇప్పటివరకు చూడని యాక్షన్ సీన్స్‌ను ‘సాహో’లో చూడవచ్చని.. ప్రభాస్ నటన అద్భుతంగా ఉందని సెన్సార్ వాళ్ళు కితాబు ఇచ్చారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో ఈమూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -