అంధుడిగా ఆది పినిశెట్టి…

320
Nani reveals the title of Aadhi Pinisetty’s next
- Advertisement -

హీరో పాత్రలతో పాటు విలన్ పాత్రలో కూడా నటిస్తున్నాడు ఆది పినిశెట్టి. ఇటీవల ఆయన నటించిన చిత్రం ‘రంగస్థలం’. రామ్ చరణ్‌, సమంతా హీరో హీరోయిన్‌లుగా సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో రామ్ చరణ్‌కు అన్నయ్యగా నటించి తన పాత్రతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

 Nani reveals the title of Aadhi Pinisetty’s next

ప్రస్తుతం ఆయన హీరోగా ల‌వ‌ర్స్ ఫేమ్ హ‌రి డైరెక్షన్‌లో ఓ చిత్రం రూపొందుతోంది. ఇందులో కథానాయికలుగా తాప్సీ, గురు ఫేం రితికా సింగ్‌లు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్‌ను తాజాగా నానీ ట్విట్టర్ వేదికగా విడుదల చేశాడు. ఈ సినిమాలో ఆది అంధుడిగా కనిపించనున్నాడని సమాచారం. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘నీవెవ‌రో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు చిత్ర యూనిట్.

ఈ సినిమాకు చిన్నా సంగీతం అందిస్తుండగా సాయి శ్రీరామ్ కెమేరామెన్‌గా వ్యవహిరిస్తున్నాడు. ఆది అంధుడిగా నటిస్తుండటంతో అంచనాలు పెరిగాయి. చాలా రోజుల తర్వాత మళ్లీ హీరోగా దర్శనమిస్తున్న ఆది ఏ స్థాయిలో విజయం సాధిస్తాడో చూడాలి. ఈ సినిమాను కోన ఫిల్మ్ కార్పొరేష‌న్, ఎమ్‌వీవీ సినిమాస్‌ క‌లిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

- Advertisement -