తెలంగాణలో 7 జోన్లు-2 మల్టీ జోన్లు

234
Farmers Cheques and pass books on 10nth by KCR
- Advertisement -

తెలంగాణ ఉద్యోగులకు మేలు జరిగే విదంగా గతంలో జరిగిన అన్యాయం పునరావృతం కాకుండా జోనల్ ,మల్టీ జోనల్ వ్యవస్థ ఏర్పాటుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడు జోన్లు,రెండు మల్టీ జోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహంచిన కేసీఆర్…చిన్న జిల్లాలు ఉన్నందున ఆయా జిల్లాల్లో ఉండే వారికి ఎక్కువ ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకున్నారు. జోనల్,మల్టీ జోనల్ వ్యవస్థకు కేబినెట్ అమోదం లభించిన తర్వాత రాష్ట్రపతి అమోదం కోసం పంపనున్నారు.

జోన్లు:

1.కాళేశ్వరం జోన్(28.20 లక్షల జనాభా):భూపాలపల్లి,మంచిర్యాల,ఆసిఫాబాద్,పెద్దపల్లి,
2.బాసర(39.74 లక్షల జనాభా)ఆదిలాబాద్,నిర్మల్,నిజామాబాద్,జగిత్యాల
3.రాజన్న జోన్(43.09 లక్షల జనాభా):కరీంనగర్,సిద్దిపేట,సిరిసిల్ల,కామారెడ్డి,మెదక్
4.భద్రాద్రి జోన్(50.44 లక్షల జనాభా):కొత్తగూడెం,ఖమ్మం,మహబూబాద్,వరంగల్ రూరల్,వరంగల్ అర్బన్
5.యాదాద్రి జోన్(45.23 లక్షల జనాభా):సూర్యపేట,నల్గొండ,యాదాద్రి,భువనగిరి,జనగామ
6.చార్మినార్ జోన్(1.03 కోట్ల జనాభా):హైదరాబాద్,రంగారెడ్డి,మేడ్చల్,సంగారెడ్డి
7.జోగులాంబ జోన్(44.63 లక్షల జనాభా):మహబూబ్ నగర్,వనపర్తి,గద్వాల,నాగర్ కర్నూల్,వికారాబాద్

మల్టీ జోన్లు:

మల్టీ జోన్‌ 1: కాళేశ్వరం,బాసర,రాజన్న,భద్రాద్రి(1.61 కోట్ల జనాభా)
మల్టీ జోన్ 2:యాదాద్రి,చార్మినార్,జోగులాంబ(1.88 కోట్ల జనాభా)

- Advertisement -