హిస్టారికల్ మూవీలో హీరో కల్యాణ్ రామ్..

35
Bimbisara

టాలీవుడ్‌లో హీరోగా, నిర్మాత‌గా ప్రయోగాలు చేస్తూ ప్రేక్ష‌కులు హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్.. మ‌రో ఎక్స్‌పెరిమెంట్‌కు సిద్ధ‌మ‌య్యారు. ఈసారి చారిత్రక కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. క‌ళ్యాణ్ రామ్ తాజాగా ‘బింబిసార’ అనే హిస్టారికల్ మూవీలో నటిస్తున్నారు. ఇవాళ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతే బింబిసారుడు.

ఈ చిత్రానికి వశిష్ఠ (నిర్మాత మల్లిడి సత్యనారాయణరెడ్డి తనయుడు) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మిస్తున్నాడు. పుణ్యభూమిలో ఓ అటవిక రాజు కథే ఈ సినిమా అంటూ చిత్రబృందం మోషన్ పోస్టర్ లింకును పంచుకుంది. ఇందులో కల్యాణ్ రామ్ సరసన కాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిశోర్ కనిపించనున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.

BIMBISĀRA - #NKR18 Title Reveal | Nandamuri Kalyan Ram | Vashist | Hari Krishna K | NTR Arts