మహేష్ నమ్రతల న్యూ పిక్‌ వైరల్‌..

119
mahesh

సూపర్‌ స్టార్‌ మహేష్‌ నమ్రతాల ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్‌ అవుతుంది. ఈ ఫోటోను మహేష్ గారాలపట్టి సితార తీసింది. ఈ ఫోటోను తాజాగా నమ్రతా శిరోద్కర్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. మన ఉనికికి మూలకారణం ప్రేమే అన్న విషయాన్ని తాను బలంగా నమ్ముతున్నానని పోస్ట్ కూడా పెట్టింది. ప్రేమ మాత్రమే మనల్ని సంతోషంగా జీవించేలా చేస్తుందని ఆమె పేర్కొంది. దయ, జాలి వంటి వన్నీ ప్రేమ వల్ల కలిగే భావోద్వేగం నుంచే వస్తాయని తెలిపింది.

అందరూ ప్రేమతో ఉండాలని ఆమె కోరింది. మనకు జీవించడానికి ఒక జీవనం ఉందని, అలాగే ఇవ్వడానికి ఒక జీవితం ఉందని, ఇవే తన నిజమైన సంతోషానికి కారణమని చెప్పింది. కాగా, ప్రస్తుతం మహేశ్‌బాబు తన కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’లో నటిస్తోన్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ నేపథ్యంలో షూటింగులకు బ్రేక్ పడడంతో ఆయన ఇంట్లోనే కుటుంబ సభ్యులతో ఉంటూ ఎంజాయ్ చేస్తున్నాడు.