‘నిశబ్దం’తో ఆకట్టుకుంటున్న అనుష్క.. వీడియో

138
Nishabdham

అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘నిశబ్దం’. ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. ఇదివరకే విడుదల కావలసిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలకు సిద్ధం అయింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి స్పెషల్ గా ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగు తమిళ భాషలతో పాటు మలయాళ డబ్బింగ్ వర్షన్ ని స్ట్రీమింగ్ కి పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘నిశ్శబ్దం’ ట్రైలర్ ని దగ్గుబాటి రానా రిలీజ్ చేసాడు.

ఈ ట్రైలర్‌ పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ముఖ్యంగా కిడ్నాప్, హత్య, మిస్టరీ, హార్రర్ నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో అనుష్క మూగ అమ్మాయి పాత్రలో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో అనుష్క శెట్టితో పాటు తమిళ నటుడు మాధవన్, హాలీవుడ్ నటుడు మ్యాడ్‌సన్… ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే, హీరోయిన్ అంజలి, అవసరాల శ్రీనివాస్ వంటి తారలు నటిస్తున్నారు. ‘నిశ్శబ్దం’ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Nishabdham - Official Trailer (Telugu) | R Madhavan, Anushka Shetty | Amazon Original Movie | Oct 2