నల్గొండలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం..

238
palabhishekam
- Advertisement -

నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రైతులు. 25000 లోపు రుణాలను మాఫీ చేసినందుకు,7 వేల కోట్లు రైతుబంధు నిధులు విడుదల చేసినందుకు రైతులు తో కలిసి సీఎం చిత్ర పటానికి ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ వైస్ ఛైర్మన్ ఏసిరెడ్డి దయాకర్ రెడ్డి పాలాభిషేకం చేశారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మొదటి విడతగా 25000 మాఫీ చేసి , వానాకాలం పంటలకు ఆర్ధిక సాయం చేసిన గొప్ప మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని దయాకర్ రెడ్డి అన్నారు…రైతులు చాలా సంతోషంగా ఏ చికూ చింత లేకుండా వానాకాలం పంటలకు సిద్ధం అవుతున్నారని అన్నారు.

కరోనా లాక్ డౌన్ సందర్భంగా ప్రతి కుటుంబానికి 1500 రూపాయలు,12కేజీల బియ్యం ఇచ్చి పేదల కడుపు నింపడని అన్నారు.కరోనా విపత్తు నివారణకు లక్ష రూపాయలు సీఎం సహాయనిదికి చెక్కు ను స్థానిక mla కు దయాకర్ రెడ్డి అందించారు.

- Advertisement -