కేసీఆర్‌, కేటీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం..

30

ఈరోజు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో చిన్న మధ్యతరహా పత్రికా సంపాదకుల కృతజ్ఞత సభ నిర్వహించడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న చిన్న మరియు మధ్య తరహా పత్రికలకు ప్రభుత్వ ప్రకటనల జారీ ప్రక్రియను ఈ నెల నుంచే ప్రారంభం కానున్న సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది తెలంగాణ ఎంపానెల్ మెంట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ (TESMNA). ఈ కార్యక్రమానికి చిన్న మరియు మధ్యతరహా పత్రికల ఎడిటర్ లు అందరు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సభకు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్, హైదరాబాద్ టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు యోగానంద్ హాజరై ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. చిన్న మధ్యతరగతి పత్రికల ఈ కలను సాకారం చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరియు కల్వకుంట్ల తారక రామారావుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తమ హర్షధ్వానాల మధ్య కృతజ్ఞతలు తెలిపారు.