సాగర్‌,శ్రీశైలంకు పోటెత్తిన వరద..

351
nagarjuna sagar
- Advertisement -

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నాగార్జున సాగర్,శ్రీశైలంకు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో నాగార్జున సాగర్ 6 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిన దిగువకు విడుదల చేశారు అధికారులు. సాగర్ నీటిమట్టం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 311.74 టీఎంసీలుగా ఉంది. ఇన్‌ ఫ్లో 1,50,020 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 65,070 క్యూసెక్కులు.

మరోవైపు శ్రీశైలంకు భారీగా వరద నీరు చేరింది. దీంతో ఐదు గేట్లను 10 అడుగల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884.70 అడుగులు. ఇన్‌ఫ్లో 1,68,000 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 1,49,000 క్యూసెక్కులు. ప్రాజెక్టు కుడిగట్టు, ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

- Advertisement -