పూరీ బర్త్ డే.. ‘ఇస్మార్ట్ శంకర్’ రీ రిలీజ్

501
iSmart-Shankar-Puri-Jagannadh
- Advertisement -

ఎనర్జీటిక్ స్టార్ రామ్ హీరోగా పూరీ జగన్నాద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. నిధి అగర్వాల్, నభా నటేశ్ లు హీరోయిన్లుగా నటించిన ఈచిత్రం జులై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈమూవీ రామ్ కెరీర్ లోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది. బాక్సాఫిస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. విభిన్నమైన కథాంశంతో .. హుషారెత్తించే పాటలతో ఈ సినిమా మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది.

దర్శకుడు పూరీ జగన్నాథ్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమాను రి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాత ఛార్మీ. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ఓ 10 థియేటర్స్ లో మరోసారి ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 27 .. 28 .. 29 తేదీలలో కేవలం 10 ధియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు.

ఇస్మార్ట్ శంకర్ రీ రిలీజ్ అయ్యే ధియేటర్ల వివరాలు…
తెలంగాణలో దిల్ సుఖ్ నగర్ – వెంకటాద్రి, వరంగల్ – లక్ష్మణ్, కరీంనగర్ – తిరుమల, ఖమ్మం – ఆదిత్య, ఖాజీపేట – భవాని థియేటర్స్ లో ఈ సినిమాను ఈ నెల 27న విడుదల చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి – ఊర్వశి, కాకినాడ – దేవి, తిరుపతి – విఖ్యాత్, గుంటూరు – స్వామి, వైజాగ్ – గోకుల్ థియేటర్స్ లో సినిమాను విడుదల చేయనున్నారు.

- Advertisement -