రవిబాబు ‘ఆవిరి’ టీజర్‌ వచ్చేస్తోంది..!

558
- Advertisement -

హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఎ ఫ్ల‌యింగ్ ఫ్రాగ్స్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ర‌విబాబు దర్శ‌క నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం `ఆవిరి`. ర‌విబాబు, నేహా చౌహాన్‌, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్‌, ముక్తార్ ఖాన్ ప్ర‌ధాన తారాగ‌ణంగా నటిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ravibabu

ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి కథ గురించి ముఖ్యమైన విషయాలను సస్పెన్స్‌లో ఉంచుతూ, ప్రెషర్ కుక్కర్ ద్వారా వచ్చే ఆవిరితో టైటిల్ నే హైలైట్ చేస్తూ వస్తున్నాడు దర్శకుడు రవిబాబు. తాజాగా ఆయన ఒక వీడియోను వదిలాడు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను విడుదల చేస్తున్నట్టు ఈ వీడియో ద్వారా ఆయన తెలియజేశాడు. ‘అవును’ తరువాత ఆ స్థాయి సక్సెస్ చూడని రవిబాబుకి, ఈ సినిమా అయినా విజయాన్ని అందిస్తుందో చూడాలి మరి..!

- Advertisement -