సాగర్ బైపోల్…ఎన్నికల పరిశీలకుల పాత్ర కీలకం

134
- Advertisement -

ఎన్నికల పారదర్శక నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సాధారణ పరిశీలకులు సజ్జన్ సింగ్ ఆర్.చవాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఉదయాదిత్య సమావేశ మందిరంలో నిర్వహించిన మైక్రో అబ్జర్వర్లు శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో సూక్ష్మ పరిశీలకుల నియామకం విధుల కేటాయింపు చేసినట్లు, మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల కమీషన్ చే నియామకం చేయబడిన ఎన్నికల పరిశీలకుని పరిథిలో పనిచేస్తారని అన్నారు.

మైక్రో అబ్జర్వర్లు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రక్రియను తీరును పరిశీలించి, ఎన్నికల పరిశీలకునికి నివేదిక అందజేస్తారన్నారు. ఎన్నికల సందర్భంగా ఏవైనా నియమ ఉల్లంఘనలు జరిగితే, వెంటనే పరిశీలకుని దృష్టికి తీసుకురావాలన్నారు.పోలింగ్ పదిశీలన, పొలింగ్ రోజున,మాక్ పోలింగ్,పోలింగ్ ప్రక్రియ ప్రారంభం,ముగింపు పరిశీలన చేయాలని,ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జరుగుతుందా పరిశీలన చేయాలని అన్నారు.జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ మాట్లాడుతూ నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ఏప్రిల్ 17 న ఉదయం 7 గంటలనుంది రాత్రి 7 గంటల వరకు జరుగుతుందని,పోలింగ్ బూత్ లోకి పి.ఓ.లు,ఏ.పీ. ఓ.లు,ఓ.పి.ఓ.లు,ఉర్తింపు కార్డు కలిగిన రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లు,మైక్రో పరిశీలకులు,జిల్లా ఎన్నికల అధికారి,ఎన్నికల విధులలో ఉన్న అధికారులు,ఓటర్లు, ఎన్నికల కమిషన్ జారీ చేసిన పోలింగ్ అథారిటీ పాస్ లు జారే చేసిన మీడియా కు అనుమతి ఉంటుందని అన్నారు.

మైక్రో పరిశీలకులు ఏప్రిల్ 16 వ తేదీన హాలియా లో ప్రభుత్వ ఐ. టి.ఐ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం లో ఉదయం 7 గంటలకు రిపోర్ట్ చేయాలని,పొలింగ్ బృందాలతో ఏర్పాటు చేసిన వాహనం లో కేటాయించిన పోలింగ్ కేంద్రం కు వెళ్లాలని అన్నారు.మైక్రో పరిశీలకులు బాధ్యతలు, విధులు గురించి శిక్షణలో వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్,మైక్రో పరిశీలకుల నోడల్ అధికారి రాజ శేఖర్,లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ సూర్యం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -