సాగర్ బైపోల్…బండి డిపాజిట్ ఎత్తుగడ ఫలిస్తుందా..?

285
bjp
- Advertisement -

నాగార్జున సాగర్ నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ప్రధాన పార్టీల నుండి పోటీ చేసే అభ్యర్థులెవరో తేలిపోయింది. టీఆర్ఎస్ నుండి నోముల భగత్, కాంగ్రెస్ నుండి జానారెడ్డి, బీజేపీ నుండి రవికుమార్ బరిలో ఉన్నారు. ఇక ప్రధానంగా భగత్, జానారెడ్డి మధ్య పోరు ఉండనుండగా బీజేపీ నామమాత్రానికే పరిమితం కానుందని టాక్.

సాగర్‌లో బీజేపీకి అంత పట్టులేకపోవడం ఒక కారణమైతే ఇటీవల జరిపిన పార్టీ సర్వేలో కూడా ఇదే విషయం తేటతెల్లమైందట. దీంతో ఇప్పటివరకు సాగర్ టికెట్ ఆశించిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నివేదిత,యాదవ సామాజిక వర్గానికి చెందిన కడారి అంజయ్య యాదవ్‌లకు కాకుండా ఎస్టీ వర్గానికి చెందిన రవికుమార్‌ను బరిలోకి దింపింది బీజేపీ.

దీనివెనుక బండి అండ్ బ్యాచ్‌ పెద్ద ఎత్తుగడే వేశారట. కాంగ్రెస్ నుండి రెడ్డి, టీఆర్ఎస్ నుండి యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతలు బరిలో ఉండటంతో కనీసం డిపాజిట్ దక్కాలంటే నియోజకవర్గంలో చెప్పుకొదగ్గ స్ధాయిలో ఉన్న ఎస్టీ సామాజిక వర్గం నుండి అభ్యర్థిని బరిలోకి దింపడం ద్వారా కనీసం పరువైనా దక్కుతుందని కమలం నేతలు భావించారట. అందుకే జనరల్ స్థానంలో ఎస్టీని బరిలోకి దింపి సాహసమే చేసినా అంజయ్య,నివేదిత వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ముఖ్యంగా అంజయ్య యాదవ్ కారెక్కేందుకు సిద్ధం కాగా నివేదిత పైకి పార్టీ అభ్యర్థికి సహకరిస్తానని చెబుతున్నా క్షేత్రస్ధాయిలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. మరి సాగర్‌లో కనీసం డిపాజిట్ దక్కాలని బండి బ్యాచ్ వేసిన ఎత్తుగడ ఫలిస్తుందో లేదో చూడాలి..

- Advertisement -