బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విజయవంతంగా పూర్తైంది. 105 రోజుల పాటు సాగిన బిగ్ బాస్ 3 సీజన్ టైటిల్ విన్నర్‌గా హైదరాబాద్ పాతబస్తీకి చెందిన రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు. రాహుల్‌కి 34 శాతం ఓట్లు రాగా శ్రీముఖికి 28 శాతం ఓట్లు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు రాహుల్.
ఇక బిగ్ బాస్ సీజన్ 1, సీజన్ 2ల కంటే సీజన్ 3 ఎక్కువ ప్రేక్షకాభిమానాలను పొందడమే కాదు టీఆర్పీలోనూ టాప్‌లో నిలిచింది. ఇందుకు కారణం హౌస్ మేట్స్ ఒకరైతే మరొకరు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున.
తన హోస్టింగ్‌తో హౌస్ మేట్స్‌నే కాదు ప్రేక్షకులను బిగ్ బాస్ చూసేలా చేయడంలో సక్సెస్ సాధించాడు. ముఖ్యంగా ఓ వైపు హాస్యాన్ని పండిస్తూనే మరోవైపు సరైన జడ్జిమెంట్‌తో అందరి హృదయాలను గెలుచుకున్నాడు.ఈ విషయాన్ని ఫైనల్స్‌లో గెస్ట్‌గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెల్లడించారు. బిగ్ బాస్ సీజన్ 3 నాగ్ వల్లే విజయవంతమైందని చెప్పుకొచ్చాడు.
ఇక గతంలో నాగ్ హోస్ట్‌గా వచ్చిన మీలో ఎవరు కోటిశ్వరుడు సైతం బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా మా ఛానల్ రేటింగ్ పెరగడంలో ఈ షో ఎంతగానే ఉపయోగపడింది. తాజాగా బిగ్ బాస్‌తో బుల్లితెరపై తనదైన ముద్రవేశారు నాగ్.