అల…వైకుంఠపురంలో టబు ఫస్ట్ లుక్

532
tabu bd
- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా అల..వైకుంఠపురంలో. బన్నీ సరసన పూజా హెగ్డె కథానాయికగా నటిస్తోంది. కె.రాధాకృష్ణ, అల్లు అరవింద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈమూవీలో సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో కనిపించనుంది. నేడు టబు పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

 ఆమె చూపులు మన హృదయాలను కొల్లగొడుతాయి. ఆమె టాలెంట్ తో ఎవరినైనా ఆకట్టుకోగలదు. లబుకు పుట్టిన రోజు శుభాకాంక్షాలు. మీతో మరిన్ని చిత్రాలు చేయాలని మేము ఎదురుచూస్తున్నాం. అంటూ చిత్రయూనిట్ ట్వీట్ చేశారు. టబు ఈమూవీలో శ్రీమంతురాలైన ‘అలకనందాదేవి’ పాత్రలో టబు కనిపించనుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో ఆమె లుక్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈచిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

- Advertisement -