నాగార్జున , నాగ చైతన్య కలిసి ప్రేమమ్ సినిమాలో కనిపించి అక్కినేని అభిమానులను అలరించిన సంగతి మనకు తెలిసిందే. అంతకు ముందు అక్కినేని నాగేశ్వరరావుతో, తన కొడుకులిద్దరితో కలిసి మనం సినిమాలో కనిపించిన నాగార్జున ఇప్పుడు మళ్ళీ అఖిల్ తో కలిసి కెమెరా ముందుకు వచ్చారు.
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి నాగార్జున, అఖిల్ ఇద్దరూ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. కాగా ఇటీవల ఈ షాపింగ్ మాల్ యాడ్ కోసం వీరిద్దరూ కలిసి నటించిన ఆ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో విహరిస్తోంది. ఒకరితో ఒకరు పోటీ పడుతూ చివరికి ఇద్దరూ ఒకే మాటమీదకు వచ్చి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన షాపింగ్ మాల్ అని చెప్తూ వచ్చిన ఈ యాడ్ అక్కినేని అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.
ప్రస్తుతం నాగార్జున నానితో కలిసి “దేవదాస్ ” లో నటిస్తుండగా, అఖిల్ మూడవ చిత్రం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
https://www.youtube.com/watch?v=i98v1kURXMo