మొహం దాచుకున్న శ్రియ ..!

270
Actress Shriya
- Advertisement -

తిరుమల దర్శనానికి సినీ ప్రముఖులు తరచు వెళ్ళివస్తూ వుండే సంగతి మనకి తెలిసిందే. అందులో కొందరు ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అభిమానుల రద్దీ ఎక్కువగా ఉండే సమయం లో సినీ ప్రముఖులు వారికి ఎదురైతే అక్కడ తొక్కిసలాట జరిగే ప్రమాదముంది. అభిమానులు ఎక్కువగా ఉంటే సినీ ప్రముఖులు కూడా ఇబ్బంది పడే అవకాశాలు , ఇంతకు ముందు జరిగిన అనుభవాలు లేకపోలేదు.

Actress Shriya

ఇటీవల తిరుమలను దర్శించుకున్న నటి శ్రియ శరణ్ ఈ మధ్యే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ళితంతు పూర్తయిన తర్వాత తిరుమలేశుని దర్శించుకునేందుకు వచ్చిన శ్రియ ఎవ్వరికీ కనిపించకుండా ఫేస్ ని చీర కొంగుతో దాచుకుంటూ రహస్యంగా దర్శనం గావించి వెనుదిరిగింది. కానీ ప్రతి చోట ఓ కన్నేసి ఉండే మీడియాకి మాత్రం దొరికిపోయింది. శ్రీయ ఆలా రహస్యంగా దైవ దర్శనం చేసుకోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

2008 లో శ్రియ ఒకసారి తిరుమలకి రాగా అప్పుడు తన చుట్టూ మూగిన అభిమానుల్లో ఒకరు అసభ్యంగా ప్రవర్తించగా శ్రియ అతని చెంప పగలగొట్టి అక్కడినుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంతకాలం తర్వాత తిరుపతికి వచ్చిన శ్రియ ఇలా మొహం దాచుకుని వెళ్లడం తనకున్న అనుభవమే కారణమని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

- Advertisement -