‘ప్రగతి నివేదన సభ’కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

216
HC Green Signal
- Advertisement -

ప్రగతినివేదన సభకు హైకోర్టు గ్రీన్‌సిగ్నలిచ్చింది. రంగరెడ్డి జిల్లాలోని కొంగర కలాన్ వద్ద వచ్చే నెల 2న తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ నిర్వహించనుంది. అయితే ఈ సభ వల్ల పర్యావరణానికి నష్టం కలుగే అవకాశముందని నడిగడ్డ పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పూజారి శ్రీధర్ గురువారం హైకోర్టులో పిటీషన్‌ వేశారు.

ఈ సభ కారణంగా 1600 ఎకరాల్లో చెట్లను కొట్టేస్తున్నారనీ, వెంటనే ఈ సభకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ లో పేర్కొన్నారు శ్రీధర్‌. అంతేకాకుండా ఈ సభ కోసం 25 లక్షల మందిని సమీకరిస్తున్నారనీ, లక్ష వాహనాలను వాడుతున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.

అయితే గత నాలుగున్నర సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకే ఈసభను టీఆర్‌ఎస్‌పార్టీ నిర్వహిస్తోందని, పర్యావరణానికి ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం ప్రగతి నివేదన సభకు అనుమతి ఇస్తూ తీర్పు ఇచ్చింది.

- Advertisement -