- Advertisement -
నగరి ఎమ్మెల్యే, వైస్సార్సీపీ కీలక నేత ఆర్కే రోజా నేడు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలను చేపట్టారు. తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలను స్వీకరించారు. మంగళగిరి ఆటోనగర్‌లోని ఏపీఐఐసీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు తన ఛాంబర్‌లో బాధ్యతలను చేపట్టారు.
జూన్ నెలలోనే రోజాకు ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ పదవిని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. రెండు సంవత్సరాలు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. ఏపీ మంత్రి వర్గంలో రోజాకు ఖచ్చితంగా చోటు దక్కుతుందని భావించినా..కొన్ని సమీకరణల ప్రకారం ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఆమెకు మరో కీలక పదవి అప్పజెప్పారు జగన్.
- Advertisement -