బీజేపీ సీనియర్ నేత,మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. కొంతకాలంగా నాగం పార్టీ విడుతారని ప్రచారం జరుగుతోంది. అయితే,ఈ వ్యాఖ్యలను ఖండించని ఆయన ఇవాళ నిర్ణయాన్ని ప్రకటించారు. తన అనుచరులతో సుదీర్ఘ సమావేశం అనంతరం బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన అమిత్ షాకు మెయిల్ ద్వారా లేఖను పంపారు.
బీజేపీకి రాజీనామా చేశానని, ఏ పార్టీలో చేరేది త్వరలోనే చెప్తానని ఆయన తెలిపారు. నాగర్‌కర్నూలు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమమంలో టీడీపీని వీడి తెలంగాణ నగారా పార్టీని పెట్టారు.
2013లో ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు.2013లో బీజేపీలో చేరారు. బీజేపీ తనల సేవల్ని వినియోగించుకోవడం లేదని అసంతృప్తితో రగిలిపోయిన ఆయన చివరకు కార్యకర్తల అభిష్టం మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే,ఆయన ఏ పార్టీలో చేరుతారనే వార్తలపై సస్పెన్స్ మాత్రం వీడలేదు.