టాలీవుడ్లో ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. సావిత్రి బయోపిక్ మహానటి సక్సెస్ తర్వాత ఎన్టీఆర్,వైఎస్ఆర్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ తెరకెక్కనుందని కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. దీంతో చిరంజీవి బయోపిక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నాగబాబు.
వరుసగా బయోపిక్‌లు వచ్చేస్తున్నాయి. చిరంజీవి కూడా చాలా ఒడుదుడుకులు ఎదుర్కొని ఇండస్ట్రీలో నిలబడగలిగారు ఆయనపై బయోపిక్ తీసే ఉద్దేశం ఉందా అంటే ఏ బయోపిక్ అయినా సరే.. ఉన్నది ఉన్నట్లు తీస్తే అది బయోపిక్ అవుతుంది. ఫేబ్రికేట్ చేస్తే అది పురాణం అవుతుందన్నారు. కథలో నిజం చెప్పాలన్నారు.
చిరంజీవిపై నిర్మాతగా తాను సినిమా తీసే ప్రసక్తేలేదని రామ్‌చరణ్‌కు కూడా ఆ ఆలోచన ఉండి ఉండదన్నారు. తనమీద బయోపిక్ తీస్తే బాగుంటుందని అన్నయ్య చిరంజీవి అనుకోరని ఎందుకంటే ఆయనది అంత సెల్ఫ్ ప్రమోషన్ వ్యక్తిత్వం కాదన్నారు. అయినా చిరు బయోపిక్ తీయాలంటే కొన్ని లక్షణాలు ఉండాలన్నారు.
కథానాయకుడు, యాత్ర సినిమాలను తాను చూడలేదన్నారు నాగబాబు. అయితే త్వరలో విడుదల కాబోతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాపై నమ్మకం కలుగుతుందన్నారు.ఆర్జీవీ అంటే వ్యక్తిగతంగా గౌరవం లేదని ఆయనపై కామెంట్ కూడా చేయదలుచుకోలేదన్నారు.