పార్కులో పెళ్లి.. భజరంగ్‌దళ్‌కు షాక్..!

213
Bajrang Dal
- Advertisement -

ప్రేమికుల దినోత్సవం సంధర్బంగా హైదరాబాద్ కండ్లకోయ ఆక్సిజన్‌ పార్కులో భజరంగ్‌దళ్ కార్యకర్తలు ఓ జంటకు పెళ్లిచేసిన సంగతి తెలిసిందే. భజరంగ్‌దళ్ కార్యకర్తలు బలవంతంగా పెళ్ళి చేయడంపై అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదుచేశారు.

తమ బంధువైన రాకేష్‌తో సుష్మా పార్కులో ఉండగా వారిని ప్రేమికులుగా భావించి పెళ్లిచేశారని వీరిపై చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. పెళ్లిచేసినప్పటీ నుండి సుష్మా ఫోన్ స్వీచ్ఛాఫ్ వస్తుందని తన బిడ్డ ఎక్కడుందో తెలియడం లేదని భజరంగ్‌దళ్ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తమ అమ్మాయి పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యామని ఫిర్యాదులో పేర్కొన్నారు.అమ్మాయి తండ్రి  ఫిర్యాదు మేరకు ఆరుగురిపై పోలీసులు కేసు నమోదుచేశారు.

తన కూతురు సుష్మారెడ్డి సీఎంఆర్ కాలేజీలో బీటెక్ చదువుతోందని ఎప్పటిలాగే తన కూతురు కాలేజీకి వెళ్తున్నానని చెప్పి వెళ్లిందని తర్వాత తమ దూర బంధువైన రాకేష్‌తో కండ్లకోయ ఆక్సిజన్‌ పార్కులో సుష్మ పెళ్లి జరిగిన వీడియోను దగ్గరి బంధువు ఒకరు పంపారని ఆయన తెలిపారు.

- Advertisement -