మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన (మా) ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మా బిల్డింగ్ వ్యవహారంపై మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు నాగబాబు. గతంలో మా అధ్యక్షులుగా పనిచేసిన వారు ఎక్కువ ధరకు బిల్డింగ్ కొని అతి తక్కువ ధరకు అమ్మేశారని మోహన్ బాబు ఆరోపణలు చేయగా వాటిపై ఘాటుగా స్పందించారు.
బిల్డింగ్ కొనుగోలు చేసిన సమయంలో నేనే అధ్యక్షుడిగా ఉన్నాను. సినిమా పెద్దల సూచనలు.. అప్పుడు ఉన్న అవసరాలు దృష్టిలో ఉంచుకుని రూ.71.73 లక్షలతో భవనాన్ని కొనుగోలు చేశాం. ఇంటిరీయర్ డిజైన్ కోసం మరో రూ.3 లక్షలు వెచ్చించాం అన్నారు. 2008 తర్వాత ‘మా’ వ్యవహరాల్లో ప్రత్యక్షంగా భాగస్వామిని కాలేదన్నారు.
ఇప్పటివరకు మా అభివృద్ధికి కావాల్సిన సలహాలు మాత్రమే ఇచ్చానని బిల్డింగ్ అమ్మకం వ్యవహరమంతా నరేశ్ - శివాజీ రాజాలకే తెలుసు వారినే అడిగితే వివరాలు తెలుస్తాయన్నారు.
బిల్డింగ్ అమ్మకానికి పెట్టినప్పుడే మోహన్ బాబు మాట్లాడితే బాగుండేది కానీ ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అడగడంలో మోహన్ బాబు ఉద్దేశం ఏంటో అందరికీ తెలుసన్నారు. బిల్డింగ్ అమ్మకం వ్యవహరం గురించి నాపై వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా స్పందిస్తానని మోహన్ బాబుని హెచ్చరించారు.