ధరలు పెంచే బీజేపీ కావాలా…పేదలను ఆదుకునే టీఆర్ఎస్ కావాలా?

35
harishrao

ధరలు పెంచే బీజేపీ కావాలా.. పేద ప్రజలను అదుకునే టీఆర్ఎస్ కావాలా ఆలోచించాలన్నారు మంత్రి హరీష్ రావు. హుజూరాబాద్ పట్టణం, రంగనాయకుల గుట్ట వద్ద పాటిమిది ఆంజనేయస్వామి జ్ఞాన సరస్వతి దేవాలయంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, పెద్దమ్మ గుడి నిర్మాణానికి భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్‌ రావు…పెద్దమ్మ గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. వచ్చే అరు నెలల్లో గుడి పూర్తి చేసుకొని బోనాలు సమర్పించుకుందాం అన్నారు. ఇక్కడ ఇన్ని దేవాలయాలు ఉన్న రోడ్డు ఉండకపోవడం సరైంది కాదు….చిలుక వాగు బ్రిడ్జి కోసం కోటి రూపాయలు మంజూరు చేశాం అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది…30 లక్షల రూపాయలతో దేవాలయాన్ని అద్భుతంగా తీర్చి దిద్దుతాం అన్నారు.

గతంలో ఇక్కడ ఉన్న మంత్రి ఒక్క డబుల్ బెడ్ రూం కూడా కట్టలేదు….హుజూరాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు వేల ఇండ్లు ఇచ్చినా ఒక్క ఇల్లు కట్టలేదన్నారు. స్థలం ఉన్న వారికి డబ్బులు ఇచ్చి ఇల్లు క్కట్టించే బాధ్యత నేను తీసుకుంటానన్నారు. ఒక్క ఇల్లు కట్టని ఈటల రాజేందర్ కు ఓటు వేస్తే ఎలా అభివృద్ది చేస్తారని…అభివృద్ది కావాలంటే గెల్లు శ్రీనివాస్ కు ఓటు వేసి గెలిపించాలన్నారు. నెలనెలా గ్యాస్ ధర పెంచి సబ్సిడీ తగ్గిస్తుంది బీజేపీ….నిత్యావసర ధరలు పెంచి పేద ప్రజల మీద భారం వేస్తుంది బీజేపీ అన్నారు. ఇంకా రెండేళ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుంది…కరోనా సమయంలో పేద ప్రజలను ఆదుకున్నాం అన్నారు.సెంటిమెంటు ఓట్లతో కడుపు నిండది, పని చేసే వాళ్ళను ఆదరించాలి అని కోరుతున్నా అన్నారు హరీష్ రావు.