‘జ్యోతిలక్ష్మీ’ ఫేమ్ సత్యదేవ్ హీరోగా, ప్రియాలాల్ హీరోయిన్‌గా ఆకార్ మూవీస్ పతాకంపై రామ్‌గోపాల్‌వర్మ శిష్యుడు మోహన్ బొమ్మిడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ దాము కొసనం, ‘దళం ’జీవన్‌రెడ్డి నిర్మిస్తున్న విభిన్న ప్రేమకథా చిత్రానికి గువ్వ గోరింక అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను నేడు విడుదలచేశారు.
ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ‘విభిన్న మనస్తత్వం కలిగిన ఇద్దరు ప్రేమికుల కథ ఇది. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్‌ను ప్రేమికుల రోజున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటివరకూ హైదరాబాద్, అన్నవరం, వరంగల్‌లలో జరిగిన షూటింగ్‌తో 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. కొత్త తరహా సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని పంచుతుందనే నమ్మకముంది’ అని తెలిపారు. చైతన్య, మధుమిత, పెళ్లిచూపులు ప్రియదర్శి, ఈటీవీ ప్రభాకర్, ఫిష్ వెంకట్, సత్య ప్రియ, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, పాటలు: కందికొండ, కృష్ణకాంత్, మిట్టపల్లి సురేందర్, మాటలు: బజారా, డీఓపీ: మైల్స్ రంగస్వామి