తమిళనాడు ముఖ్యమంత్రిగా సూపర్‌స్టార్‌…!

267
Rajinikanth joining politics
- Advertisement -

తమిళనాడు దివగంత ముఖ్యమంత్రి  జయలలిత మరణించినప్పటి నుంచి తమిళనాట రాజకీయాలు రోజు రోజుకు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పీఠంపై శశికళ వర్సెస్‌ పన్నీర్‌ సెల్వం మధ్య పోరు కొనసాగుతుంది. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ సెల్వం గవర్నర్‌ను కోరారు… తనకు పార్టీ ఎమ్మెల్యేల మద్దతూ పూర్తిగా ఉందటూ శశికళ గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు తెలిపింది. అయితే గవర్నర్‌ మాత్రం ఎవరికి అవకాశం ఇస్తారు అనే దానిపై సస్పెన్స్‌ నెలకొంది.

Rajinikanth joining politics

ఈసంగతి ఇలా ఉంటే తమిళనాడు రాజకీయాల్లోకి రజనీకాంత్‌ ఎంట్రీ ఇస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను తమిళనాడు ముఖ్యమంత్రిని చేయాలని భావిస్తుందట. ఒక విధాంగా బీజేపీ రజనీకాంత్‌కు బంఫర్‌ ఆఫర్‌ ఇచ్చిందనే చెప్పుకొవచ్చు. ఇప్పటికే తమిళనాడు పలు సంచలనాలకు కారణమైన క్రమంలో తమిళనాట రాజకీయాల్లో రజనీకాంత్‌ సీఎం అయితే మరో సంచలనం కానుంది. కబాలిని రాజకీయాలోకి లాగేందుకు కమళదళం విశ్వప్రయత్నాలు చేస్తుందట. ఇందులో భాగంగానే సూపర్‌స్టార్‌కు ముఖ్యమంత్రి పదవి ఆఫర్‌ చేసిందట.

Rajinikanth joining politics

ఇటీవల ఓ పుస్తకవిష్కరణ సభలో మాట్లాడిన సూపర్‌స్టార్ ‘పవర్’ అంటే తనకిష్టమంటూ వ్యాఖ్యానించి తమిళనాట పెను సంచలనానికి రేకిత్తించాడు. ఆతర్వాత  తన ‘పవర్’ వ్యాఖ్యలు ఆధ్యాత్మికతకు సంబంధించినవని రజనీకాంత్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనప్పటికీ తమిళనాడు రాజకీయాలు సంక్షోభంలో కూరుకుపోయిన క్రమంలో బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నలు చేస్తుంది. అందులో భాగంగానే సూపర్‌స్టార్‌కు ముఖ్యమంత్రి పదవిపై ఆశ చూపెడుతోంది.

Rajinikanth joining politics

కొద్ది సేపటి క్రితం రజినీకాంత్‌తో ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త గురుమూర్తి భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే రజనీ తన సన్నిహితులు, శ్రేయోభిలాషులతో బీజేపీ ఆఫర్‌పై చర్చిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తం మీద బీజేపీ ఆఫర్‌పై సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ఏం డిసైడ్‌ చేసుకుంటాడో వేచిచూడాల్సిందే మరి.

- Advertisement -