” సరిలేరు నీకెవ్వరు” ప్రీ రిలీజ్ తేదీ ఖరారు

295
Sarileru Neekevvaru

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. రష్మీక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. సీనియర్ నటి విజయశాంతి ఈమూవీలో కీలకపాత్రలో నటిస్తుంది. ఈమూవీ నుంచి విడుదల చేసిన టీజర్ తో పాటు, రెండు పాటలను మంచి స్పందన వచ్చింది. సంక్రాంతి పండగ కానుకగా జనవరి 11న ఈచిత్రాన్ని విడుదల చేయనున్నారు. తాజాగా ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదిని ఖరారు చేశారు చిత్రయూనిట్. జనవరి 5వ తేదిన ఈమూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

ఇందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు. అయితే మొదట ఈ ఫంక్షన్ ను శిల్పకళా వేదికలో చేయాలని నిర్ణయించుకున్న ఆ తర్వాత మహేశ్ బాబుకు సెంటిమెంట్ ప్లేస్ అయిన ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నారు. మహేశ్ బాబు నటించిన భరత్ అనే నేను, మహర్షి మూవీల ప్రీ రిలీజ్ ఫంక్షన్ లను కూడా ఎల్బీ స్టేడియంలోనే నిర్వహించారు. ఈరెండు సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి. ఈసారి కూడా మహేశ్ బాబు అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాపై భారీగా అంచనాలున్నాయి.