దర్శకుడిగా మారిన నాగ శౌర్య..!

267
Naga Shaurya's Bhoomi Short Film
- Advertisement -

ఈ ఏడాది వచ్చిన బిగ్గెస్ట్ హిట్స్‌లో తనది కూడా ఒకటి ఖాతాలో వేసుకున్న కుర్ర హీరో నాగ శౌర్య దర్శకుడిగా మారాడు. కాకపోతే సినిమా కోసం కాదు లెండి. షార్ట్ ఫిలిం కోసం. ఈరోజు మదర్స్ డే సందర్భంగా స్పెషల్ షార్ట్ ఫిల్మ్ ను నాగశౌర్య విడుదల చేశారు. దర్శకుడిగా మారిన నాగశౌర్య మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా సందేశాన్ని ఇస్తూ దీన్ని రూపొందించారు. ‘భూమి’ టైటిల్‌తో తీసిన ఈ సినిమాను నాగశౌర్య విడుదల చేశారు.

Naga Shaurya's Bhoomi Short Film

‘భూమి.. భూమిలాంటిదే తల్లి కూడా. ఎంత కష్టమైనా భరిస్తుంది.. ఎంత బరువైనా మోస్తుంది. కొన్ని మదమెక్కిన మగ జంతువులు ఆడవారి మీద వాటి పైశాచిక బలాన్ని చూపిస్తున్నాయి. నిజమైన బలం మనం వాళ్లకు ఇచ్చేదే తప్పా.. వాళ్ల మీద చూపించేది కాదు. భూమిని కాపాడుకోవడానికి ప్రతి ఇంటికి ఒక్క చెట్టు నాటమన్నారు.

మరి తల్లిలాంటి ఆడవాళ్లను కాపాడుకోవడానికి ఏ చెట్టు నాటాలి’ అంటూ ఈ లఘు చిత్రంలో నాగశౌర్య సందేశం ఇచ్చారు. దీన్ని ఆయన ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘భూమి’ ఇదిగో.. మాతృదినోత్సవ శుభాకాంక్షలు అమ్మ. నా కష్టసుఖాల్లో నువ్వు వెన్నంటే ఉన్నావు. లవ్‌ యూ సోమచ్‌’ అని ట్వీట్‌ చేశారు.

- Advertisement -