నాగశౌర్య మూవీ షూటింగ్ పునః ప్రారంభం..

144
naga shourya
- Advertisement -

హ్యాండ్‌సమ్‌ హీరో నాగశౌర్య, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనీష్‌కృష్ణ కాంబినేషన్‌లో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. గతంలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ తిరిగి మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

హీరో నాగశౌర్య, హీరోయిన్‌ షిర్లే సేతియాలతో పాటు ఈ సినిమాలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా లొకేషన్‌ పోస్టర్‌లో నాగశౌర్య, షీర్లే, అనీష్‌కృష్ణ, ఉషా ముల్పూరి ఆనందంగా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌ని బట్టి సినిమా అవుట్ పుట్‌ అద్భుతంగా వస్తుందని తెలుస్తోంది.

శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ టైటిల్‌ త్వరలోనే ఖరారు కానుంది. ఈ చిత్రంలో సీనియర్‌ యాక్టర్‌ రాధిక కీలక పాత్ర పోషిస్తున్నారు. హాస్యనటులు ‘వెన్నెల’ కిశోర్, రాహుల్‌ రామకృష్ణ, సత్యల కామెడీ హీలేరియస్‌గా ఉండ‌బోతోంది. మహతి స్వరసాగర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సాయి శ్రీరామ్‌ ఛాయగ్రాహకులు.నటీనటులు: నాగశౌర్య, షీర్లే సేతియా, రాధిక, ‘వెన్నెల’ కిశోర్, రాహుల్‌ రామకృష్ణ, బ్రహ్మాజీ, సత్య తదితరులు…

సాంకేతిక విభాగం
దర్శకుడు: అనీష్‌ కృష్ణ
ప్రొడ్యూసర్‌: ఉషా ముల్పూరి
సమర్పణ: శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి
బ్యానర్‌: ఐరా క్రియేషన్స్‌
మ్యూజిక్‌ డైరెక్టర్‌: మహతి స్వరసాగర్‌
డీఓపీ: సాయిశ్రీరామ్‌
సహ నిర్మాత: బుజ్జి
ఎడిటర్‌: తమ్మిరాజు
ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌
డిజిటల్‌ హెడ్‌: ఎమ్‌ఎన్‌ఎస్‌ గౌతమ్‌
పీఆర్‌ఓ: వంశీ–శేఖర్‌

- Advertisement -